పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక గొడవర్తి రామారావు లక్ష్మీ నరసమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శిబిరంలో కాకినాడకు చెందిన కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సుమారు 300 మందికి ఉచిత కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు గొడవర్తి శ్రీరాములు, గొడవర్తి నాగేశ్వరావు తదితరులు ప్రారంభించారు.
ఆచంటలో ఉచిత కంటి వైద్య శిబిరం
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు సుమారు 300 మందికి పరీక్షలు జరిపారు.
ఆచంటలో ఉచిత కంటి వైద్య శిబిరం