పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం గ్రామం జ్వరాలతో వణుకుతోంది. దేశమంతా కరోనాతో భయపడుతుంటే.. అక్కడ మాత్రం జ్వరం పీడిస్తోంది. ఎక్కువమందికి డెంగీగా నిర్ధరణయింది. వారంతా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండు రోజుల్లో రూ.1.75 లక్షలు
భాగం శ్రీనివాసరావు అనే రైతు ఇంట్లో ఆయనతో పాటు ఆయన భార్య శ్రీలత, కుమారుడు శశాంక్‌లకు జ్వరం వచ్చింది. ప్లేట్‌లెట్స్ పడిపోవటంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ 2 రోజుల్లో రూ.1.75 లక్షల బిల్లు వేశారు. దీంతో భయపడిన ఆయన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నారు. గ్రామానికి దగ్గరలో భద్రాచలం ఉన్నందున బాధితులు అక్కడకు వెళ్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు బంద్ అయినందున.. వారంతా అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. సాధారణ పరిస్థితి ఉన్నవారికి అక్కడే చికిత్స చేస్తున్నారు. ప్లేట్‌లెట్స్ బాగా తగ్గిపోయిన వారిని మాత్రం పట్టణాలకు వెళ్లమని సూచిస్తున్నారు. అయితే వెళ్లేమార్గం లేకపోవటం, బాధితులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావటంతో ఈ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
రాకపోకలకు ఇబ్బంది