ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 3, 2020, 4:45 PM IST

Updated : Jun 3, 2020, 5:44 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ ఉపాధ్యాయుడి అత్యాశ... అక్రమ మద్యంతో చిక్కాడిలా..!

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చిన్నారుల భవిష్యత్తుకు మార్గదర్శిగా ఉండాల్సినవారు. కానీ దాన్ని పక్కనపెట్టి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి మద్యాన్ని తరలిస్తున్నాడు. అదీ పోలీసుల వాహనాలకు ఉండే సైరన్​ని.. తన వాహనానికి పెట్టుకొని మరీ తరలించబోయాడు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

eluru-police-seized-telangana-illegal-liquor-in-west-godavari-district
eluru-police-seized-telangana-illegal-liquor-in-west-godavari-district

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు గుర్తించారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ రాజేష్ కుమార్ తెలిపారు.

అసలెవరా వ్యక్తి...?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఏలూరు పరిధిలోని శనివారంపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంజయ్ నాయక్.. తెలంగాణ నుంచి సుమారు రూ.1.26 లక్షల విలువ చేసే మద్యాన్ని బొలేరో వాహనంలో తరలించారు. రాష్ట్ర సరిహద్దులు దాటే సమయంలో రాఘవాపురం సమీపంలో ఓ వ్యక్తిని ఢీకొట్టగా... అతని కాలు విరిగింది. అయినా తన వాహనాన్ని ఆపకుండా అతివేగంతో పోలీసు సైరెన్ వేసుకుని వెళ్లారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాహనాన్ని వేగంగా నడుపుతుండడంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసు సైరన్ ఎలా...

మద్యాన్ని తరలించే సమయంలో ఎవరైనా పట్టుకుంటారన్న అనుమానంతో తన వాహనానికే పోలీసు సైరన్ ఏర్పాటు చేసుకున్నాడు సంజయ్ నాయక్. సైరన్ మోగించుకుంటూ ఎక్కడా వాహనాన్ని ఆపకుండా... మందును తరలించేద్దామని ప్లాన్ చేశాడు.

ఇలా పట్టేశారు...

రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని వెంబడించి రాఘవాపురం దాటిన తర్వాత ఓ తోటలోకి వెళ్తుండగా పట్టుకుని తనిఖీలు చేశారు. లోపల తెలంగాణ మద్యం ఉండటంతో... మందుతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

వేరువేరు చోట్ల తెలంగాణ మద్యం సీజ్... ఆరుగురు అరెస్ట్

Last Updated : Jun 3, 2020, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details