ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్కడ.. వేదం అణువణువునా ప్రతిధ్వనిస్తోంది.. - ద్వారకా తిరుమల న్యూస్

వేదాలు అక్కడ నిత్యం ప్రతిధ్వనిస్తాయి. వందల మంది చిన్నారులు హిందూ ధర్మ పరిరక్షణలో నిమగ్నమైన దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మిక విధుల నిర్వహణకు అర్చకులు, యాజ్ఞికులను తీర్చిదిద్దేందుకు ఓ వేద పాఠశాల కృషి ఏళ్లుగా నిరాటంకంగా సాగిపోతోంది.

Dwaraka tirumala veda patashala
అక్కడ.. వేదం అణువణువునా ప్రతిధ్వనిస్తోంది

By

Published : Jan 2, 2020, 6:55 AM IST

అక్కడ.. వేదం అణువణువునా ప్రతిధ్వనిస్తోంది

హిందూ ధర్మ పరిరక్షణకు పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారక తిరుమల వెంకటేశ్వర దేవస్థానంలోని... వేద పాఠశాల తమవంతు పాత్ర పోషిస్తోంది. ఆలయ నిర్వహణ, పరిరక్షణ విధులకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇస్తూ కొత్త తరం అర్చకులు, యాజ్ఞికులను తయారు చేస్తోంది. 1984లో కేవలం పది మంది విద్యార్థులతో ఏర్పాటైన ఈ వేద పాఠశాలలో ప్రస్తుతం 600 మంది చదువుకుంటున్నారు. ఆలయం నిర్మించే సమయంలో స్థలం ఎంపిక నుంచి నిర్మాణం, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ వరకు అన్ని అంశాలూ ఈ వేద పాఠశాలలో బోధిస్తారు.

3 భాగాలుగా విద్య

వేద పాఠశాలలో విద్యార్థులకు బోధన కఠినతరంగా సాగుతుంది. విద్యార్థులు తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేచి వేద పఠనం, మంత్రోచ్ఛారణ చేస్తారు. ప్రవేశ, వర, ప్రవర అని 3 భాగాలుగా విద్య అందిస్తారు. ఈ కోర్సు పూర్తి చేస్తే అర్చక వృత్తిలో స్థిరపడటం లేదా తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం ఉంటుంది. పాఠశాలలో ఉచిత భోజనం, వసతి అందిస్తారు.వేద పాఠశాలలో ప్రవేశానికి దేవదాయ ధర్మదాయ శాఖ ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తుంది.

ఇదీ చదవండి :

గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగానే ప్రసవం

ABOUT THE AUTHOR

...view details