ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్వారకా తిరుమల దేవస్థానంలో అన్యమత ప్రచారం...పట్టించుకోని సిబ్బంది! - dwaraka tirumala news

పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ స్వామివారి కొండపైన దేవస్థానం సిబ్బంది నిబంధనలకు నీళ్లు వదులుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్యమత ప్రచారం యథేచ్ఛగా జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అన్యమత ఫొటోలు, స్టిక్కర్లు ఉన్న వాహనాలు కొండపైన నిబంధనలకు విరుద్ధంగా తిరగడమే దీనికి నిదర్శనమని అంటున్నారు.

Due to the negligence of the authorities on the hill of the famous shrine Dwarka Thirumala Sri Swamivari, pagan propaganda is rampant.
ద్వారకా తిరుమల దేవస్థానంలో అన్యమత ప్రచారం!

By

Published : Sep 6, 2020, 12:19 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన అన్యమత ప్రచారాన్ని పూర్తిగా నియంత్రించేందుకు దేవస్థానం గతంలో చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా... కొండపైకి అన్యమత స్టిక్కర్లు, ఫొటోలు ఉన్న వాహనాల రాకపోకలను నిషేధించారు. టోల్ గేట్ వద్ద ఉన్న సిబ్బంది ఇలాంటి వాహనాలను ఆపి వెనక్కి పంపించేవారు. కొంత కాలం అన్యమత నిషేధ నిబంధనలు అమలు చేసినప్పటికీ... రానురాను అధికారులు గాలికొదిలేశారు. దీంతో అన్యమత స్టిక్కర్లు, ఫొటోలు ఉన్న వాహనాలు కొండపైన తిరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి అన్యమత ప్రచారాన్ని నిషేధించాలని హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు కోరుతున్నారు.

అన్యమత ఫొటోలు, స్టిక్కర్లు ఉన్న వాహనాలను కొండపైకి అనుమతించవద్దని ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్​రావు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు అన్యమత స్టిక్కర్లు, ఫొటోలు ఉన్న వాహనాలలో రావద్దని సూచించారు.

ఇదీ చదవండి:అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం

ABOUT THE AUTHOR

...view details