పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రుస్తంబాదలోని సుభద్ర బలరామ సమేత జగన్నాథస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం అష్టోత్తర శత మూలిక సహిత ధన్వంతరి సుదర్శన హోమం నిర్వహించారు. వైఖానస సంఘం ఆధ్వర్యంలో పెద్దింటి అనిల్ కుమార్ ఆచార్యులు , శిష్య బృందం హోమం జరిపించారు.
కరోనా వైరస్ దూరం కావాలని ధన్వంతరి హోమం నిర్వహించినట్లు పురోహిత బృందం తెలిపింది. కరోనా ఫ్రంట్ వారియర్స ఆరోగ్యంగా ఉండాలని.. హోమఫలితం వారికి సమర్పించామని తెలిపారు. చెన్నై నుంచి 108 మూలికలు రప్పించి హోమం చేశామన్నారు.