పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో వినాయక పూజలతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.వినాయక చవితి రోజు స్వామివారిని దర్శించుకుని అక్షింతలు శిరస్సున ధరిస్తే నీలాపనిందలు,విఘ్నాలు రావని భక్తులు నమ్ముతారు.ఉదయంనుంచే భక్తులు అధిక సంఖ్యలో పూజలు నిర్వహిస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ సిబ్బంది భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తణుకులోని ఆదిదేవుడికి వైభవంగా పూజలు
వినాయక చవితి సందర్భంగా గణనాధుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. తణుకులో ఆదిదేవుని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు.
devotees did pooja at vinayaka temple in thanuku at west godavari district