'ఉల్లి' దక్కేదెప్పుడు... కన్నీరు ఆగేదెప్పుడు?
ఉల్లి ఘాటెకిస్తోంది... ప్రజల కంట కన్నీరు పెట్టిస్తోంది. సాధారణ మార్కెట్లో ఉల్లి కొనలేక... రాయితీ ఉల్లికోసం పడిగాపులుకాయలేక.. సామాన్య జనం పడుతున్న బాధలు వర్ణణాతీతం. కిలో ఉల్లి కోసం రైతు బజార్ల వద్ద తెల్లవారుజామునుంచే ప్రజలు వేచి ఉంటున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలతో బారులు తీరుతున్నారు. వృద్ధులైతే బారుల్లో నిలుచోలేక అనేక బాధలు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రాయితీ ఉల్లి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ-భారత్ ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు.
పశ్చిమగోదావరి జిల్లాలో ఉల్లి కోసం బారులు తీరిన జనం