పాలకొల్లు అంటే నాకెంతో ఇష్టం: సినీనటి చార్మి - cine unit
పాలకొల్లులో ఇస్మార్ట్ శంకర్ చిత్ర బృందం సందడి చేసింది. మారుతి థియేటర్లో ప్రేక్షకులతో కొంతసేపు ముచ్చటించింది. తన ప్రసంగంతో అభిమానుల్ని ఉత్సాహపరిచారు చార్మి.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మారుతి థియేటర్లో ఇస్మార్ట్ శంకర్ సినిమాను చూస్తున్నప్రేక్షకులకు చిత్ర బృందం ఆశ్చర్యాన్ని కలిగించింది. థియేటర్లో సినిమాని మధ్యలో ఆపి దర్శకుడు పూరి జగన్నాథ్ నటీమణులు చార్మి, నిధి అగర్వాల్, పాటల రచయిత భాస్కరభట్ల అక్కడికి చేరుకున్నారు. వీరిని చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. పాలకొల్లు అంటేనే సినీ రంగానికి పెట్టింది పేరని... ఆ ఊరు అంటే తనకు చాలా ఇష్టమని చార్మి అన్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులను హీరోయిన్ నిధి అగర్వాల్ కోరారు.