పశ్చిమగోదావరి జిల్లా తణుకు వద్ద ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం కరాటం కృష్ణమూర్తి జలాశయం నిండింది. వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఫలితంగా ఎర్ర కాలువ పొంగి ప్రవహిస్తోంది. దువ్వ వద్ద వయ్యేరు గట్టున నివాస గృహాలు నీట మునిగాయి. నివాసితులు అప్రమత్తమై గట్టుమీద తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎర్ర కాలువ ఉగ్రరూపాన్ని అధికారులు పరిశీలించారు. బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని వారు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
దువ్వ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఎర్రకాలువ
తణుకు వద్ద ఎర్ర కాల్వ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలోని జలాశయాలకు బారీగా వరద వస్తోంది. కరాటం కృష్ణమూర్తి జలాశయం నుంచి వరద దిగువకు వదులుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు