ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2021, 2:54 PM IST

ETV Bharat / state

పోతునూరూలో ఘనంగా భోగి వేడుకలు.. ఆనంద వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పోతునూరులో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ఈ ఉత్సవాల్లో పాల్గొని గ్రామంలో ఏర్పాటు చేసిన ఆనంద వనాన్ని ప్రారంభించారు.

Bhogi grand celebrations in Pothunur
పోతునూరూలో ఘనంగా భోగి

పశ్చిమ గోదావరి జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రజలు భోగి మంటలు వేశారు. పోతునూరూ గ్రామంలో గ్రామ డీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. గంగిరెద్దుల విన్యాసాలు, యువకుల నృత్యాలు, భోగి మంటలు, డప్పు వాయిద్యాలు కళారూపాలతో అత్యంత ఆకర్షణీయంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ శేషగిరి, ఎంపీడీవో లక్ష్మీ, ఈఓపీఆర్​డీ సురేష్ పలువురు గ్రామ ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆనందం వనాన్ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు.

పోతునూరూలో ఘనంగా భోగి

ABOUT THE AUTHOR

...view details