ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెత్తకుప్పలో పురిటి శిశువు... కాపాడిన స్థానికులు - attili

పశ్చిమగోదావరి జిల్లా ఉరదాలపాలెంలో పురిటి  శిశువును చెత్త కుప్పపాలు చేశారు. గమనించిన స్థానికులు కాపాడారు.

ఆడశిశువు

By

Published : May 9, 2019, 12:25 AM IST

చెత్తకుప్పలో దర్శనమిచ్చిన పురిటి శిశువు

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాలపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదిరోజుల ఆడశిశువును చెత్తకుప్పలో పడేసిన ఘటన స్థానికులను కలిచివేసింది. చెత్తకుప్పలో పడి ఏడుస్తూన్న పసిబిడ్డను చూసి కన్నీరుపెట్టుకున్నారు. ఆ పాపను అక్కున చేర్చుకున్నారు. వెంటనే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. పెనుమంట్ర అధికారులు స్పందించి వెంటనే పాపను ఆస్పత్రికి తరలించారు. శిశువును ఏలూరులోని శిశు సంరక్షణాలయంలో ఉంచుతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details