ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి జి చక్రధరరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ఉన్నత పాఠశాలలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సామగ్రిని పోలీస్ బందోబస్తు మధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 221 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో రెండు లక్షల 33 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు తదితర సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పించారు.
ఉంగుటూరులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి - tpg
పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.
ఉంగుటూరులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి