పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాంపాలెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు ఓ సామాజిక వర్గం అడ్డుకుంటుందని మరో వర్గం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు కాస్తా ఘర్షణకు దారి తీశాయి. గొడవ సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో బలగాలు చేరుకొని పరిస్థితి సమీక్షించాయి. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఇరువర్గాలతో చర్చలు జరిపారు.
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై ఇరువర్గాల మధ్య ఘర్షణ - FIGHT
అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటుపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు.
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై ఇరువర్గాల మధ్య ఘర్షణ