ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు సరదా బాలుడి ప్రాణం తీసింది - rajeshj

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో దొమ్మేరు గ్రామాంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కారు ఎక్కాలని సరదా పడిన బాలుడు మృత్యు ఒడికి చేరాడు.

కారు సరదా ప్రాణం తీసింది

By

Published : May 28, 2019, 10:03 AM IST

Updated : May 28, 2019, 1:23 PM IST

తెలిసీ తెలియని వయసులో మృత్యవును హత్తుకున్నాడు ఆ బాలుడు. ఆట బొమ్మలాగ కనిపించిన కారును ఎక్కే ప్రయత్నం చేసి సఫలమైనా... బయటకు వచ్చే దారి తెలియక తనువు చాలించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని దొమ్మేరు గ్రామానికి చెందిన కళ్లేపల్లి రాధాకృష్ణ స్థానిక పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు లక్ష్మి, ప్రియాంక అనే ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లక్ష్మికి శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి సాయిబాబా(7), వైశు అనే ఇద్దరు సంతానం. ఇటీవల శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందడంతో లక్ష్మి దొమ్మేరులోని తన పుట్టినింటికి వచ్చింది. ఎప్పటిలాగే ఆటలాడుకుంటున్న సాయిబాబా సమీపంలో కవరుతో మూత వేసి ఉన్న కారు డోరు తీసుకొని లోపలికి వెళ్లిపోయాడు. తిరిగి బయటకు వచ్చే వీలులేకపోవడంతో అందులోనే ఉండి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరాడు. స్థానికులు ఆలస్యంగా కారులో చూసేసరికి అప్పటికే విగత జీవిగా ఉన్న సాయిబాబాను సమీప కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు సాయిబాబాను పరీక్షించి మృతి చెందాడని ధృవీకరించారు. ముక్కుపచ్చలారని బిడ్డ తీరని లోకానికి వెళ్లాడనే వార్త ఆ కుటుంబాన్ని కలిచి వేసింది. అప్పటికే అనేక బాధలతో సతమతమవుతున్న ఆ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు ఆ గ్రామ ప్రజల గుండెను పిండేశాయి.

మృతుడి పిన్ని ప్రియాంక భర్త రాజేష్‌ కూడా ఇటీవల మృతి చెందారు. ఆమె కూడా తండ్రి రాధాకృష్ణ వద్దే ఉంటుంది. ఆమెకు చేతన్‌బాబు అనే కుమారుడు సంతానం. ఏడాది వయస్సులేని చేతన్‌ తన అన్న సాయిబాబాను లేపాలని, మాటలు రాకపోయినా పలుసార్లు చేతితో తలపై నిమురుతున్న తీరు స్థానికులకు కన్నీరు తెప్పిచ్చింది. సోదరి పూర్తిగా రెండేళ్లు నిండని చిన్నారి ఒంటిరిగా ఓ పక్కకు చేరి పడుతున్న వేదన... మాటలు చాలని విధంగా ఉండడంతో ఊరంతా వారి కష్టానికి తీవ్ర ఆవేదన చెందారు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది.

కారు సరదా ప్రాణం తీసింది
Last Updated : May 28, 2019, 1:23 PM IST

ABOUT THE AUTHOR

...view details