నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి సాధ్యమని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన... విశాఖ మన్యం మండలాల్లోని గిరిజనులు ప్రత్యేక జిల్లా కావాలని ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారని చెప్పారు. మూడు రాజధానులపై ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అందుకు అందరూ మద్ధుతు పలుకుతున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర పురోగతి బాగుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే - గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి..ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచన బాగుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి..ఎమ్మెల్యే
Last Updated : Dec 28, 2019, 9:16 PM IST