ఎనిమిదేళ్ల బాలికపై బాలుడి అత్యాచారం - rape case in west godavari
20:12 December 01
శంషాబాద్ ఘటన మరువకముందే పశ్చిమగోదావరి జిల్లాలో మరో దారుణం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలంలోని ఓ గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి శనివారం రాత్రి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను విచారించారు. బాలికను వైద్య పరీక్షల కోసం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాలుడిపై పోక్సోయాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.