ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇళ్ల స్థలాల జాబితాలో భూస్వాములను చేర్చారంటూ వైకాపా నాయకుల ఆందోళన

By

Published : Jul 7, 2020, 12:01 PM IST

విజయనగరం జిల్లా భోగాపురంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైకాపా నేతలు నిరసన తెలిపారు. తమ పంచాయితీ పరిధిలో రెండు, మూడు ఎకరాలు ఉన్న భూస్వాములను ఇళ్ల స్థలాల జాబితాలో ఎలా చేర్చాలంటూ ప్రశ్నించారు.

ysrcp leaders darna
ysrcp leaders darna

అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని విజయనగరం జిల్లా భోగాపురంలో వైకాపా నాయకులు ఆరోపించారు. ఈ మేరకు భోగాపురం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. రెండు, మూడు ఎకరాలు ఉన్న భూస్వాములను ఇళ్ల స్థలాల జాబితాలో ఎలా చేర్చాలంటూ ప్రశ్నించారు. ఆ భూముల విలువ కోట్లలో ఉంటుందన్నారు.

గ్రామాల్లో లేని వారిని సైతం జాబితాలో చేర్చి స్థలాలు కేటాయించడం అన్యాయమన్నారు. పంచాయతీలో పేదలు చాలా మంది ఉన్నా.. అనర్హులకు ఇవ్వడం సరికాదని ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మార్వో అప్పలనాయుడు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:భారత్​లో 20వేలు దాటిన కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details