ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసపోయాం.. న్యాయం చేయండి... - జిల్లాలో నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం

VRO jobs: విజయనగరం జిల్లా గరివిడికి చెందిన దంపతులు, వైసీపీ నాయకులు గీతవాణి, కామేశ్వరరావు వీఆర్ఓ ఉద్యోగాల పేరుతో పలువురు యువకులకను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి వద్ద సుమారు 8లక్షలు వసూలు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఉద్యోగాల విషయంలో ప్రశ్నించడంతో తప్పించుకు తిరుగుతున్నట్లు బాధిత యువకులు పేర్కొన్నారు.

VRO jobs
ఉద్యోగాల పేరుతో మోసం

By

Published : Apr 4, 2023, 8:13 PM IST

విజయనగరంలో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం

YCP leader cheated innocent people: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనలు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే, అక్కడ పేపర్ అమ్ముకోవడంలో జరిగిన గొడవల్లో తలెత్తిన వివాదం వల్ల విషయం బయటికి పొక్కింది. ఈ ఘనటపై అక్కడి ప్రభుత్వం విచారణ వేగవంతం చేసి, లీకేజ్​కు కారకులను గుర్తించే పనిలో ఉంది. ఇదే తరహ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ మాత్రం అధికార వైసీపీకి చెందిన వార్డు సభ్యురాలు వీఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులైన నిరుద్యోగును మోసం చేసింది. వారి నుంచి లక్షల రూపాయలు వసులుచేసి పరారైంది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు పోలీసు స్టేషన్ తలుపు తట్టారు.

విజయనగరం జిల్లా గరివిడికి చెందిన దంపతులు, వైసీపీ నాయకులు గీతవాణి, కామేశ్వరరావు వీఆర్ఓ ఉద్యోగాల పేరుతో మోసం చేశారని బాధితులు విజయనగరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుడు, గరివిడి మండలం జడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావుకు స్వయాన మేనకోడలు అయిన గీతవాణి., గరివిడి వైసీపీ తరపున వార్డు సభ్యురాలుగా కూడా కొనసాగుతోంది. ఈమె, తన భర్త కామేశ్వరరావుతో కలసి.. వీఆర్ఓ పోస్టులు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద 8 నుంచి 10 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ జాయినింగ్ లేఖ ఇచ్చి రెండు నెలలు సచివాలయంలో ట్రైనింగ్ పేరుతో విజయవాడలో ఉంచారు. పోస్టింగ్ ఎప్పుడని అడిగితే ఇదిగో ఈ నెల., వచ్చే నెల అయిపోతుందని చెప్పుకొచ్చారని బాధితులు విచారం వ్యక్తం చేశారు. తీరా. గరివిడిలోని ఇంటికి వెళితే., తాళం వేసి ఉందని., నాలుగైదు రోజుల నుంచి వెతుకుతున్న ఆచూకీా లభించటం లేదన్నారు. న్యాయం చేస్తానన్న లాయర్ కూడా గీతవాణి, కామేశ్వరరావుతో కుమ్మక్కై., తమను మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు సంవత్సరాల క్రితం వీఆర్ఓ జాబ్ కోసం గీతావాణికి మా భర్త 8లక్షల డబ్బులు కట్టాడు. డబ్బులు ఇచ్చిన తరువాత మాకు ట్రైనింగ్ ఇప్పిసామని విజయవాడ తీసుకెళ్లారు. కొన్ని రోజులకు మేము మోసపోయామని గ్రహించాం. అప్పటి నుంచి మా డబ్బుల కోసం గీతవాణిని అడిగితే, ఇబ్బందులు పెడుతున్నారు. డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశాం. గత కొన్ని రోజులుగా రోజు డబ్బులు ఇస్తానంటూ గీతవాణి మాటలు మారుస్తుంది. మా తరఫున ఉన్న లాయర్ సైతం ఆమెకు అనుకులంగా మారాడు. ఆయన ఇన్నాళ్లు కేసులో మాట్లాడి ఇప్పుడు కేసు నుంచి తప్పుకున్నాడు. బాధితురాలు, వీరఘట్టం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details