విజయనగరం జిల్లా కురుపాం కొమరాడ మండలం గుమ్మడ గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై గురువారం గంటల తరబడి భారీ వాహనాలు నిలిచిపోయాయి. పార్వతీపురం నుంచి ఒడిశా, రాయ్‌గఢ్ విజయనగరం వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంతల దారిలో ప్రయాణం ఇబ్బందిగా మారుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రహదారి పొడవునా గుంతలు.. నిలిచిన వాహనాలు - కురుపాం రోడ్లు తాజా సమాచారం
అది పేరుకే అంతర్రాష్ట్ర రహదారి. అయితేనేం గుంతలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది మరి. పొలాలకు వెళ్లే మట్టి రోడ్లకు తీసిపోనట్టుగా తయారైంది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
worst roads traffik jam at kurupam