ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతన బకాయిలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన - వేతనాల కోసం శ్రీరాంపురంలో కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా శ్రీరాంపురంలోని స్టీల్ ఎక్సైజ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. బిహార్, ఉత్తరప్రదేశ్​లకు చెందిన కార్మికులు నిరసన చేపట్టారు.

workers protest for wages at srirampuram vizianagaram district
వేతన బకాయిలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన

By

Published : Apr 23, 2020, 8:14 PM IST

వేతన బకాయిలు చెల్లించాలంటూ బిహార్, ఉత్తరప్రదేశ్​కు చెందిన కార్మికులు.. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం శ్రీరాంపురంలో ఆందోళనకు దిగారు. గ్రామంలోని స్టీల్ ఎక్సైజ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారంలో ఎస్ఎంఎస్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేశారు. లాక్ డౌన్ తర్వాత వేతనాలు చెల్లించి స్వస్థలాలకు పంపుతామని కర్మాగారం యాజమాన్యం స్పష్టం చేసింది.

అయితే వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించగా.. కార్మికులు వారిపై రాళ్లు రువ్వారు. ఈ కారణంగా... పోలీసు వాహనాల అద్దాలు పగిలగా.. కేసు నమోదైంది. చివరికి.. యాజమాన్యం వారికి బకాయిలు చెల్లించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details