విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి.. శృంగవరపుకోట మండలం బొడ్డవర వద్ద ఉన్న అంతర్ జిల్లా చెక్ పోస్టును పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. చెక్ పోస్ట్ వద్ద రాకపోకల నియంత్రణను మరింత కఠినతరం చేయాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఇతర అత్యవసర సేవల ఉద్యోగులనే అనుమతించాలని స్పష్టం చేశారు. పక్క జిల్లాల నుంచి ఎవరూ రాకుండా చూడాలన్నారు. అనంతరం పట్టణంలో పర్యటించి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
శృంగవరపుకోట చెక్ పోస్టును పరిశీలించిన ఎస్పీ - శృంగవరపు కోట చెక్ పోస్టును పరిశీలించిన విజయనగరం ఎస్పీ
విజయనగరం జిల్లాలోకి ఇతర జిల్లాల వారిని అనుమతించవద్దని శృంగవరపు కోట చెక్ పోస్టు వద్ద ఉన్న సిబ్బందిని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. అక్కడ ఉన్న అంతర్ జిల్లా చెక్ పోస్టును పరిశీలించారు.
శృంగవరపుకోట చెక్ పోస్టును పరిశీలించిన ఎస్పీ రాజకుమారి