రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి - two youngsters died
విజయనగరం జిల్లా సాలూరులోని జూట్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గండ్ర టి.బుజ్జి అనే వ్యక్తి అక్కడికక్కడే కన్నుమూయగా.... అడసాల ప్రవీణ్ అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణం విడిచాడు. వీళ్లిద్దరు పాచిపెంట గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
two-people-are-died-in-road-accident-at-viziyanagaram