ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 25, 2020, 3:46 PM IST

ETV Bharat / state

మహిళా పోలీసులకు తైక్వాండో శిక్షణ

మహిళలపై దాడులను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు రూపొందించాయి. అయినప్పటికీ దాడులకు అడ్డుకట్ట పడడంలేదు. విజయనగరం జిల్లా పోలీసుశాఖ మహిళా రక్షక్ పోలీసుల ద్వారా వీటిని కొంతలో కొంతైన అరికట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత.. మహిళా రక్షక్ పోలీసులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇస్తోంది.

Training in Taekwondo for female police guard
మహిళా రక్షక్ పోలీసులకు ఆత్మరక్షణపై శిక్షణ

ఆకతాయిలు, శత్రువుల నుంచి ఆత్మరక్షణ పొందే నైపుణ్యాన్ని నేర్పించేందుకు విజయనగరం జిల్లా పోలీసుశాఖ మహిళా రక్షక్ పోలీసులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇస్తోంది. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో తొలి విడతగా పది మంది మహిళా రక్షక్ కానిస్టేబుళ్లకు 15 రోజుల పాటు తైక్వాండో శిక్షణ ఇస్తోంది.

తైక్వాండో శిక్షణ కార్యక్రమంలో పోలీసు శాఖలో 15 మంది బృందంతో కూడిన మహిళా రక్షక్ పోలీసు దళం శిక్షకుల ద్వారా తర్ఫీదు పొందుతున్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా పంచ్, కిక్, లాకింగ్, రిలీజింగ్, నాన్ చెక్స్ అంశాలను నేర్పిస్తున్నారు. వీటి ద్వారా సులువుగా భౌతిక దాడులు, విపత్తుల నుంచి మహిళలు బయటపడవచ్చు. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందని శిక్షకులు చెబుతున్నారు.

పోలీసుశాఖ వినూత్నంగా చేపట్టిన తైక్వాండో శిక్షణ కార్యక్రమంపై మహిళా రక్షక్ కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ శిక్షణ రాత్రి వేళల్లో విధులు నిర్వర్తిస్తున్నవారికి మరింత దోహదపడతాయని అంటున్నారు. మహిళలు, యువతుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని., మహిళా రక్షక్ పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

ఆదివాసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న 'ఆర్ట్స్‌' స్వచ్ఛంద సంస్థ

ABOUT THE AUTHOR

...view details