నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు రానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ విడుదల చేస్తారు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటిస్తున్నారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2020, 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఈసారి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందనే దానిపైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
రాష్ట్రంలో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.
నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల