విజయనగరం జిల్లా తెదెపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితుడైన కిమిడి నాగార్జునను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. నియోజకవర్గంలో పెద్దలను, యువతను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా నాగార్జున అన్నారు.
అనంతరం చీపురుపల్లి తహసీల్దార్ ను కలిశారు. రాజధాని రైతులకు పోలీసులు సంకెళ్ళు వేయడాన్ని ఖండించారు. అన్నం పెట్టే రైతన్నల చేతికి సంకెళ్ళు వేసి తీసుకురావడం అవమానమని ఆవేదన చెందారు. అన్నదాతలకు సంకెళ్లు వేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని కోరారు. కర్షకులపై ఉన్న కేసును కొట్టివేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు.