ఉపకార వేతనాలు, బోధనా రుసుములు చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలో భారీ మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సర్కారు తక్షణం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బోధనా రుసుములు చెల్లించాలని విద్యార్థుల ధర్నా - sfi dharna in vijayanagaram
విజయనగరం జిల్లా ఎస్.కోటలో.. ఉపకార వేతనాలు, బోధనా రుసుములు చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా తరలివచ్చి నినాదాలు చేశారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన