నిబంధనల ప్రకారం నడుపుతున్న తమ బస్సులను పొరుగు జిల్లాల ఆర్టీఏ అధికారులను పిలిపించి సీజ్ చేయిస్తున్నారని... దివాకర్ ట్రావెల్స్ యజమాని మాజీఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ వేధింపులు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా... రాజకీయ కక్షతోనే తమ బస్సులను నిలిపివేయిస్తున్నారని ఆయన మీడియాతో చెప్పారు.
దివాకర్ ట్రావెల్స్ బస్సులకు నిబంధనల మేరకు రికార్డులన్నీ ఉన్నాయని, అందువల్లే అనంతపురం ఆర్టీఏ అధికారులు సీజ్ చేయలేకపోతున్నారని చెప్పారు. ఇతర జిల్లాల అధికారులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ బస్సులన్నీ సీజ్ చేసినా భయపడేదిలేదని, న్యాయపోరాటం చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెడుతున్న ఈ ప్రభుత్వం... భావితరాల పరిస్థితి ఏమవుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల పట్ల.. జగన్ మోహన్ రెడ్డి కంటే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేలనే విషయం అవగతమవుతోందని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి : అమరావతిపై అంత కక్ష ఎందుకు?: పవన్‌కల్యాణ్