ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం సారూ ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించండి..! - Vizianagaram latest news for students darna

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేశారు. గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. జిల్లాల్లోని కలెక్టరేట్​ కార్యాలయాలను మట్టడించి తమ డిమాండ్​లను వెంటనే తీర్చాలని నినదించారు. ఈ ధర్నాలో.. విద్యార్థులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

sfi and students (darna) protest for giving Fee Reimbursement in guntur, visakhapatnam,  Vizianagaram
రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థుల ధర్నా

By

Published : Dec 19, 2019, 6:23 PM IST

రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థుల ధర్నా

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్​ ఎదుట విద్యార్థుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేశారు.

విశాఖలో ఆందోళన

విశాఖ జిల్లా పాడేరులో రీయింబర్స్​మెంట్​ బకాయిలు వెంటనే చెల్లించాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పాడేరు అంబేద్కర్ కూడలి నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీగా తరలివచ్చారు. పెండింగ్​లో ఉన్న 10 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విజయనగరంలో ఉద్రిక్తం

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నాకు దిగారు. విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం స్పందించి వెంటనే పీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details