విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని మీసేవ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు.