విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రాంతంలో గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లటానికి అవస్థలు పడుతున్నారు. సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. పొర్లు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి ఇటీవల నొప్పులు వచ్చాయి. గ్రామం నుంచి డోలీ కట్టి ఆసుపత్రికి బయల్దేరారు. మార్గమధ్యలోనే ఆమె ప్రసవించింది. 20 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లిన గ్రామస్థులు... 108 వాహనంలో ఎస్.కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు వాపోతున్నారు.
గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగానే ప్రసవం - Pregnancy pains ... delivery while Dolly was taken to the hospital with help in vizianagaram district
సరైనరోడ్డు మార్గం లేదు. ఆసుపత్రికి వెళ్లాలంటే కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలి. ఇది గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి. సాధారణ సమయంలో ఎలా ఉన్నా... గర్భిణిలు ప్రసవ సమయంలో మాత్రం నరకం చూడాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది విజయనగరం జిల్లాలో.
గర్భిణికి నొప్పులు... డోలీలో తీసుకెళ్తుండగా ప్రసవం