నిండు గర్భిణీని 6 కిలోమీటర్లు డోలీలో మోస్తూ... - Pregnant woman carried in a cloth cradle for 6 kms
🎬 Watch Now: Feature Video

సాంకేతిక రంగంలో దేశం నానాటికీ ముందుకు పోతున్నప్పటికీ.. కొన్ని గ్రామాల పరిస్థితులు మాత్రం మారట్లేదు. పలు మారుమూల పల్లెలకు ఇప్పటికీ సాగు నీరు, తాగు నీరు, కరెంటు వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు ఈరోడ్ జిల్లా అంతియూర్ గ్రామంలోని బర్కుర్ కొండ ప్రాంతానికి సరైన రోడ్డు వసతి లేక.. కుమారి అనే నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. 108కి ఫోన్ చేసినప్పటికీ వర్షాలు పడి రహదారి మరింత అధ్వానంగా తయారైనందున అంబులెన్స్ గ్రామానికి చేరలేకపోయింది. అయితే ఆమె భర్త స్థానికుల సాయంతో.. కుమారిని అంబులెన్స్ వరకు దాదాపు ఆరు కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లాడు. అక్కడి నుంచి అంబులెన్సులో ప్రాథమిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కుమారి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.