విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ అర్థరాత్రి వరకు కొనసాగింది. పార్వతీపురం మండలం కృష్ణ పల్లిలో సాయుధ పోలీసులు కలియ తిరిగారు. పోలింగ్ సమయంలో చోటు చేసుకున్న ఘర్షణలపై ఎస్పీ రాజకుమారి లెక్కింపు ప్రక్రియకు అదనపు బలగాలు పంపించారు. ఇరువర్గాలను దూరంగా ఉంచి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు.
పార్వతీపురం నియోజకవర్గంలో పోలీసుల పహారా
గ్రామపంచాయతీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు సాగింది. సమస్యాత్మక గ్రామాల్లో సాయుధ పోలీసులు పహారా మధ్య లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. పార్వతీపురం మండలం కృష్ణ పల్లిలో సాయుధ పోలీసులు పహార కాశారు.
పార్వతీపురం నియోజకవర్గంలో పోలీసుల పహారా
ఆ పంచాయతీ ఫలితాలు అర్ధరాత్రి సమయంలో ప్రకటించారు. అప్పటివరకు సాయుధ పోలీసులు పహారా కాస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. సీఐలు వెంకట్రావు లక్ష్మణరావు ఎస్ఐ కళాధర్ పర్యవేక్షిస్తూ గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి జమ్మన ప్రసన్నకుమార్ రాత్రి గ్రామానికి చేరుకొని వర్గీయులను అభినందించారు.
ఇదీ చదవండి: జగతిని నడిపే ప్రేమకు ఘనమైన చరిత్ర