విజయనగరంలోని మక్కువ మండలంలో జరుగుతున్న శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను... పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేహ ఖరే ఆదేశించారు. పోలమాంబ అమ్మవారి ఆలయం వద్ద ఆయన సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చెత్తను డంప్ చేయడం, క్లోరినేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.
వైద్యారోగ్య శాఖ మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 108 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పార్కింగ్ పై దృష్టి సారించాలని.. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా... వేర్వేరుగా ఎంట్రన్స్, ఎగ్జిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్ నిభందనలు అందరూ పాటించాలని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా మాస్క్ ధరించి, చేతులు శుభ్రం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. అందుకు తగిన విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో హెండ్ వాష్ బేసిన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.