కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు సార్వత్రిక సమ్మెకు దిగాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 22సంఘాలు సంయుక్తంగా బంద్‌లో పాల్గొన్నారు. గాంధీబొమ్మ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. కురుపాంలో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా జరిగింది. పార్వతీపురంలో ప్రధాన రహదారి ఎరుపెక్కింది. వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. విజయనగరం జిల్లా పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మానవహారం చేశారు. ఎస్.కోట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ అరకు వెళ్లే రోడ్డు పై బైఠాయించారు. పోలీసులు 11 మంది కార్మిక సంఘ నేతలను అరెస్టు చేశారు.
ఎరుపెక్కిన విజయనగరం జిల్లా రహదారులు - భారత్ బంద్ తాజా న్యూస్
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌లో అన్ని పార్టీలు,కార్మికులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోనూ సార్వత్రిక సమ్మె జరిగింది.
విజయనగరం జిల్లాలో జరిగిన సార్వత్రిక సమ్మె