విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేట వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో.. ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న బడ్డీ నరసింహులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
పార్వతీపురం మండలం అడ్డాపుశీల నుంచి ఆటోలో బాడంగి వెళ్తుండగా.. అంటిపేట వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. బాడంగిలో ఒకరు చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు.. బాధితులు తెలిపారు.