Botsa Satyanarayana : అర్హతలు లేని వారి పింఛన్లను మాత్రమే అధికారులు తొలగిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. అర్హులైన వారి పింఛన్లు తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో నిర్వహించిన కొత్త పింఛన్ దారులకు.. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అర్హత లేని వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నారు : మంత్రి బొత్స
Botsa Satyanarayana : ప్రభుత్వం ఇటీవల సామాజిక పింఛన్లను తొలగించింది. అయితే ఈ పింఛన్ల తొలిగింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పింఛన్లను అందరికిీ అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. అర్హతలు లేని వారి పింఛన్లను మాత్రమే తొలగిస్తున్నారని తెలిపారు.
మంత్రి బొత్స
పించన్ల తొలగింపు గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. వాటిని ప్రజలు నమ్మవద్దని అన్నారు. మూడేళ్లుగా పింఛన్ల పంపిణీలో కొత్త ఒరవడి ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి :