ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 15.95 కోట్ల రూపాయల జైకా నిధులతో చేపట్టనున్న విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఆండ్ర ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులకు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శాసనసభ్యులు రాజన్నదొర, అప్పలనరసయ్య, కలెక్టర్ హరి జవహర్ లాల్, నీటి పారుదల శాఖ అధికారులతో కలసి మంత్రి బొత్స శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
సీఎం జగన్ రైతు పక్షపాతి: మంతి బొత్స - మంత్రి బొత్స వార్తలు
రైతుల అభివృద్ధి కోసం వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాలోని ఆండ్ర జలాశయం ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఆండ్ర జలాశయం ఆధునీకరణ పనుల ద్వారా మెంటాడ, గజపతినగరం, బొండపల్లి మండలాల్లోని 27 గ్రామాల్లోని 9,426 ఎకరాల ఆయకట్టుకు సాగు నీటికి భరోసా కలుగుతుందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు మిగిలిన పనులను కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను మంత్రి వల్లె వేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరంలాంటివని అన్నారు. రైతులకు సొంత గ్రామాల్లోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందించే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసిందన్నారు
ఇదీ చదవండి
'హామీలు నెరవేర్చారో.. మోసాలకు పాల్పడ్డారో.. ప్రజలే చెబుతారు'