ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2021, 2:56 PM IST

ETV Bharat / state

స్వేచ్ఛగా.. నిర్భయంగా ఓటేయాలి: ఎస్పీ

విజయనగరంజిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి జోరందుకుంది. ఇప్పటికే పార్వతీపురం డివిజన్ పరిధి 15మండలాలు, విజయనగరం డివిజన్​ లోని 9 మండలాల్లో నామినేషన్లు పర్వం పూర్తయింది. ప్రచారం ముమ్మరంగా సాగింది. జిల్లాలో ఆఖరి విడత జరగనున్న శృంగవరపుకోట, గజపతినగరం నియోజకవర్గాలతో పాటు, సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం స్థానిక నాయకత్వం ఎడతెగని సంప్రదింపులు జరుపుతోంది. గెలుపు ఓటములపై రచ్చబండ చర్చ రసవత్తంగా సాగుతోంది. విజయనగరం జిల్లాలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ రాజకుమారి స్పష్టం చేశారు.

local body
local body

ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా చూడాలని, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పార్వతీపురం డివిజన్‌లో జరగనున్న ఎన్నికలకు చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఆమె పోలీసులకు దిశానిర్దేశం చేశారు. 15 మండలాల్లోని 497 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని, వాటిలో 75 అతి సున్నిత, 135 సున్నిత, 202 సాధారణ, 74 మావోయిస్టు ప్రభావిత, 11 సరైన మార్గం లేని పోలింగు కేంద్రాలున్నట్లు చెప్పారు. ఇప్పటికే 3,033 గ్రామాలను పోలీసులు సందర్శించి, గ్రామసభలు నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించారన్నారు.

గిరిజనులు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకొనే వాతావరణాన్ని కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతున్నట్లు అనిపిస్తే డయల్‌-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీలు ఎన్‌.శ్రీదేవీరావు, పి.సత్యనారాయణ, బెటాలియన్‌ కమాండెంట్‌ కోటేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

కొఠియాలో ఎన్నికలు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కొఠియా గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించామన్నారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

ఇదీ చదవండి:పల్లెపోరు రెండో విడతకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్ !

ABOUT THE AUTHOR

...view details