తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విజయనగరం జిల్లాలోని రమణ మహర్షి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో తిరిగి తెదేపా అధికారంలోకి రావాలని ప్రార్థించారు.
కళా ప్రత్యేక పూజలు
By
Published : Mar 11, 2019, 6:23 PM IST
కళా ప్రత్యేక పూజలు
విద్యుత్ శాఖ మంత్రి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, కిమిడి కళా వెంకట్రావు.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం రమణమహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం చీపురుపల్లిలోని కనక మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో తెదేపా మళ్లీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించారు. ఉత్తరాంధ్రంలో మెుత్తం 34 స్థానాలకు గాను 30 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.