కరోనా ప్రభావంతో చేతుల శుభ్రతకు ప్రాధాన్యత పెరిగింది. వ్యాపార కూడళ్లు, బ్యాంకుల వద్ద సబ్బు నీళ్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన గౌతమ్ కుమార్ మొబైల్ హ్యాండ్ వాష్ పరికరాన్ని తయారు చేశాడు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో పరికరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. దీని తయారీకి కేవలం రూ.2 వేల 500 ఖర్చు అవుతుందని... వ్యాపారులు ముందుకు వస్తే మరిన్ని పరికరాలు తయారు చేసి అందిస్తానని పేర్కొన్నాడు.
యువకుడి వినూత్న ఆలోచన...మెుబైల్ హ్యాండ్ వాష్ పరికరం రూపల్పన
విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన యువకుడు చేతులు కడుక్కోవడానికి ప్రత్యేక పరికరానికి రూపకల్పన చేశాడు. కేవలం రూ. 2500 ఖర్చుతో మెుబైల్ హ్యాండ్ వాష్ పరికరాన్ని తయారుచేశాడు.
మెుబైల్ హ్యాండ్ వాష్ పరికరం రూపల్పన