కలియుగ భీముడు.. కోడి రామ్మూర్తి నాయుడు జయంతిని పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో బలప్రదర్శన నిర్వహించారు. నగరంలోని కోడి రామ్మూర్తి మున్సిపల్ పార్క్లో కార్యక్రమాన్ని చేపట్టగా.. 70 సంవత్సరాల వయస్సు ఉన్న అభినవ భీమ.. పెద్ది లక్ష్మీనారాయణ చేసిన బల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. స్టార్ట్ చేసిన రెండు అంబాసిడర్ కార్లను కదలకుండా ఆపి.. తన బలాన్ని చూపించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్దఎత్తున హాజరయ్యారు. క్రమం తప్పుకుండా వ్యాయామం, యోగా చేయటం, సరైన ఆహార నియమాలు పాటించటం వలనే శారీరకంగా దృఢంగా ఉన్నట్లు పెద్ది లక్ష్మీనారాయణ తెలిపారు. శరీర దృఢత్వం కారణంగానే తాను 70 సంవత్సరాల వయసులో కూడా కార్లను ఆపగలుగుతున్నానని ఆయన అన్నారు. మీరూ వ్యాయామాలు చేయండంటూ విద్యార్థులకు సూచించారు.
70 ఏళ్ల వయస్సులో.. ఆకట్టుకున్న బల ప్రదర్శన - విజయనగరం జిల్లాలో బలప్రదర్శన చేసిన 70 ఏళ్ల వ్యక్తి
కోడి రామ్మూర్తి నాయుడు జయంతిని పురస్కరించుకుని విజయనగరంలో బలప్రదర్శన నిర్వహించారు. 70 ఏళ్ల వయస్సున్న పెద్ది లక్ష్మీనారాయణ చేసిన బలప్రదర్శన ఆకట్టుకుంది.
70 ఏళ్ల వయస్సులో.. ఆకట్టుకున్న బలప్రదర్శన