భార్యాభర్తల గొడవల్లో పిల్లల.. ప్రాణాలు పోతున్నాయి. ఇద్దరిలో ఎవరికి కోపం వచ్చినా.. బాధ వచ్చినా.. కొందరు తమ పిల్లలనే నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తున్నారు. ప్రాణాలు సైతం తీస్తున్నారు. ఆర్థిక, అనారోగ్య సమస్యలైనా సరే.. వాటికి పరిష్కారం వెతకుండా వాళ్లు బలవన్మరణానికి పాల్పడుతూ.. అభం శుభం ఎరుగని చిన్నారులను సైతం హత్య చేస్తున్నారు.
ఇలాంటి ఓ గొడవ.. ఇద్దరు పసిబిడ్డల పాలిట మృత్యుపాశమైంది. భార్యతో గొడవపడిన ఆ భర్త.. తన పిల్లలపాలిట మృత్యువులా మారాడు. కోపంతో ఇద్దరు పసి బిడ్డలను బండకేసి కొట్టాడు. ఈ దారుణమైన ఘటనలో.. రెండేళ్ల పసి పాప అక్కడికక్కడే మరణించగా.. ఐదేళ్ల వయసున్న మరో పాప.. తీవ్ర గాయాలపాలైంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడి వలసలో ఈ ఘాతుకం జరిగింది.