స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీలకు వేదికైన జీఎంఆర్ ఐటీ- ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు GMR IT Hosted Smart India Hackathon at Rajam:విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2023ను కేంద్ర విద్వాశాఖ మంత్రిత్వశాఖ నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ పోటీలు జరిగాయి. ఏఐసీటీఈ నిర్వహిస్తున్న పోటీలు విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఐటీ విద్యాసంస్థలోనూ నిర్వహించారు. ఈ పోటీల్లో 13 రాష్ట్రాల నుంచి 26 బృందాలు పాల్గొన్నాయి.
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ద్వారా విద్యార్థులు నూతన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఆవిష్కరణలు, అధునాతన సాఫ్ట్‌వేర్లు రూపొందించారు. 2017లో మొదలైన హ్యాకథాన్ పోటీలను దేశంలోని ఎంపికైన కళాశాలల్లో నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే జీఎంఆర్ ఐటీలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామంటూ అధ్యాపకులు చెబుతున్నారు.
'గురి' తప్పని బుల్లెట్ - రైఫిల్ షూటింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న యువ కెరటం
హ్యాకథాన్ పోటీలకు ఎంపికైన కళాశాలకు కొన్ని రంగాలను కేటాయిస్తారు. ఈ క్రమంలో జీఎంఆర్ ఐటీ విద్యాసంస్థకు వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, ఫిట్‌నెస్, ఆటలు, వినోద రంగాలను కేటాయించారు. వీటికి సంబంధించి విద్యార్థులు ఆధునిక సాంకేతికతను రూపొందించడం సహా సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు రూపొందించి ఆవిష్కరణను ఇలా వివరిస్తున్నారు.
హ్యాకథాన్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ముందుగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఒక్కో టీంకు ఆరుగురు విద్యార్థులు అందులో అమ్మాయిలు కచ్చితంగా ఉండాలనే నియమం ఉంది. దీంతోపాటు సామాజికంగా ప్రజలకు ఉపయోగపడే సాంకేతికతను తయారు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా వారు నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచస్థాయిలో ఆవిష్కరించేందుకు ఇదొక చక్కని అవకాశంగా భావిస్తున్నారు.
యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు
36 గంటలు జరిగే పోటీలకు గాను విద్యార్థులకు వివిధ సాంకేతిక సమస్యలను ఇస్తారు. విద్యార్థులు తమకిచ్చిన గడువులోపు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అందులో రాణించినవారు విజేతలుగా నిలుస్తారు. పరిష్కారం చూపడం, నూతన ఆవిష్కరణలు చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. దాంతోపాటు పరిశోధనకు సంబంధించిన ప్రోత్సాహకాలనూ కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అందిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు.
హ్యాకథాన్ లాంటి టోర్నమెంట్లు ద్వారా తమలో సాంకేతిక పరిజ్ఞానం మెరుగు పడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. పోటీతత్వంతో మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు. దాంతోపాటు నూతన ఆవిష్కరణలతో వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నూతన సాంకేతిక ఆవిష్కరణలు రూపొందిస్తున్న వారిని చూసి అనేక విషయాలు నేర్చుకుంటున్నామని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. అవి భవిష్యత్‌లో తమ ఎదుగుదలకు దోహదపడుతాయని అంటున్నారు.
అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్