విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలో దారపర్తి గిరిజన పంచాయతీ శివారు పల్లపు దుంగాడ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. ఈ గ్రామానికి చెందిన జరత నాగరాజు అనే యువకుడికి పచ్చకామెర్లు ముదిరి... పరిస్థితి విషమించింది. విధిలేక గిరిజనులు డోలీ కట్టి 12 కిలోమీటర్ల దూరం కొండలు గుట్టలు దాటుకుంటూ తీసుకొచ్చి ఎస్.కోట సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స ఇవ్వగా పరిస్థితి విషమించింది. స్థానిక వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... తమ పంచాయతీకి రహదారి సౌకర్యం కల్పించాలని అమాయక గిరిజనులు కోరుతున్నారు.
'దారి' లేని గిరిజన బతుకులు..!
పాలకులు మారినా... వారి బతుకులు మాత్రం మారడం లేదు. వారి గ్రామాలకు దారి లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకే శరణ్యం. రోగులను, గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. ఫలితంగా పదుల కిలోమీటర్లు నడవాల్సిందే. డోలీలు కట్టి తరలించాల్సిన దుస్థితే. తాజాగా ఎస్.కోట మండలంలోని దారపర్తి పంచాయతీకి చెందిన యువకుడికి ఆరోగ్యం క్షీణించగా... ఇలా డోలీ కట్టి 12 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రిలో చేర్చారు.
గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు