రాష్ట్రంలో ఒకే ఒక గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న విజయనగరంలో తొలిసారి 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి నుంచి జిల్లా గ్రీన్ జోన్లో కొనసాగుతుండటంతో ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా 3 కేసులు వెలుగులోకి రావటంతో జిల్లాలో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం నివారణ చర్యలు చేపట్టింది.
విజయనగరం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన యంత్రాంగం - విజయనగరంలో కరోనా వార్తలు
విజయనగరం జిల్లాలో తొలిసారి కరోనా కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకు గ్రీన్ జోన్లో కొనసాగిన జిల్లాలో ఒక్కసారిగా 3 కేసులు వెలుగుచూశాయి. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.
![విజయనగరం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన యంత్రాంగం corona positive cases in vizianagaram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7097431-403-7097431-1588844544336.jpg)
విజయనగరం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు