ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అరకు వైకాపా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు సూచించారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు.
'పంట కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి' - చినమేరంగిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు
విజయనగరం జిల్లా చినమేరంగిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా నేత శత్రుచర్ల పరీక్షిత్ రాజు మాట్లాడుతూ... రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చినమేరంగిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు
మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ... మండలంలో 337 ఎకరాల్లో మొక్కజొన్న పంట ఉందన్నారు. మొత్తం 11 వందల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. కనీస మద్దతు ధర 1760 రూపాయలకు పంట కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి.. రిక్షా తొక్కుతూ రేషన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే