విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో 15 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది. మెుత్తం 29 వార్డులు ఉండగా కాంగ్రెస్ మాత్రం కేవలం ఈ ఒక్క స్థానంలోనే పోటీలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ద్వారపురెడ్డి విశాలాక్షి అత్యధిక మెజార్టీతో గెలిచింది.
ఇదివరకు మూడు సార్లు హస్తం గుర్తుపై 569 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి కూడా ప్రజలు నన్ను గుర్తించి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అందుకే నేను నా వార్డ్కు, వార్డులో ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా అభివృద్ధి చేస్తానన్నారు. 29వ వార్డుల్లో ఎవరికీ రాని మెజార్టీ కేవలం తనకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.