విజయనగరం జిల్లాలో పార్వతీపురం ప్రాంత అభివృద్ధి వేదిక సమావేశం నిర్వహించారు. భాస్కర కళాశాలలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంగా చేయాలని వారు డిమాండ్ చేశారు.
'పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి'
పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా పార్వతీపురం అభివృద్ధి వేదిక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గిరిజన ప్రాంతాలకు ముఖద్వారంగా ఉన్న పార్వతీపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
committee-meeting
కేంద్రానికి అవసరమైన అన్ని వసతులు అర్హతలు పార్వతీపురానికి ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. గిరిజన ప్రాంతాలకు ముఖ ద్వారంగా ఉన్న పార్వతీపురంని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. భౌగోళిక పరిపాలన పరంగా ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని వివరించారు. జిల్లా కేంద్రం సాధనకు అన్ని వర్గాలు కలసి కృషి చేయాలని నిర్ణయించారు.
TAGGED:
committee meeting