ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక చర్యల వల్లే ఇది సాధ్యమైంది: కలెక్టర్ - ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ తాజా వ్యాఖ్యలు

నాలుగో విడత పంచాయతీ పోలింగ్​లోనూ విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్ నమోదైంది. తుది దశలో 87.09 శాతం నమోదైంది. అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యల వల్లే రెండు, నాలుగు విడతల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ తెలిపారు.

collectore harijawahar lal comments on fourth phase electons
నాలుగో విడత ఎన్నికలపై కలెక్టర్ హరిజవహర్ లాల్

By

Published : Feb 21, 2021, 10:01 PM IST

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ విజయనగరం జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి 3.30 గంటలకు జిల్లా వ్యాప్తంగా 87.09 శాతం పోలింగ్ నమోదైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అత్యంధికంగా లక్కవరపుకోటలో 90.99 శాతం, కొత్తవలస మండలంలో 82.87 శాతం అత్యల్పంగా ఓట్లు పోలయ్యాయి.

మండలాల వారీగా..

మెంటాడ మండలంలో 86.86 శాతం, దత్తిరాజేరులో 90.09, గజపతినగరంలో 85.63 శాతం., బొండపల్లిలో 90.25, గంట్యాడలో 89.13 శాతం పోలింగ్ నమోదైంది. జామి మండలంలో 85.58 శాతం, శృంగవరపుకోట మండలంలో 83.11శాతం, వేపాడలో 89.34 శాతం, లక్కవరపుకోటలో 90.99 శాతం, కొత్తవలస మండలంలో 82.87 శాతం పోలింగ్ నమోదైంది.

ఇవీ చూడండి...

విజయనగరం జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఫలితాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details